KTR: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ పోటీ ఇచ్చినా మూడో స్థానానికే పరిమితం అవుతుందని భావిస్తున్నారు. ఈ దశలో ఇప్పటి వరకూ ప్రధాన పార్టీలు చేరికలు, ఓటర్ల జాబితాల పరిశీలనకు పరిమితం అయ్యారు. ఇక నుంచి ప్రచారంపైనే దృష్టి పెట్టనున్నారు.
KTR: ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున 40 మంది స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఆయా నేతలు ఇప్పటికే కాలనీలను చుట్టి వచ్చారు. ఇంటింటి ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ఓటర్లకు గుర్తులు చూపుతూ అవగాహన కల్పిస్తూ వాడవాడలా తిరుగుతున్నారు. ఇప్పటి వరకూ చేరికల సభల్లోనే పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక నుంచి రోడ్‌షోలు నిర్వహించనున్నారు.
KTR: అక్టోబర్ 31 నుంచి నవంబర్ 9 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్ల పరిధిలో కేటీఆర్ వరుస రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఆయా చోట్ల 9 రోజుల పాటు జరిగే రోడ్‌షో సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒకటి, రెండు రోడ్ షోలలో పాల్గొనవచ్చని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ పాల్గొనే రోడ్‌షోలు
తేదీలు – డివిజన్
అక్టోబర్ 31 – షేక్‌పేట
నవంబర్ 1 – రహెమత్‌నగర్
నవంబర్ 2 – యూసుఫ్‌గూడ
నవంబర్ 3 – బోరబండ
నవంబర్ 4 – వెంగళ్‌రావునగర్
నవంబర్ 6 – ఎర్రగడ్డ
నవంబర్ 8 – షేక్‌పేట, యూసుఫ్‌గూడ, రహెమత్‌నగర్
నవంబర్ 9 – షేక్‌పేట నుంచి బోరబండ వరకు భారీ బైక్ ర్యాలీతో ప్రచారం ముగింపు

