KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జూన్ 18న లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇటీవలే లండన్, యూఎస్ పర్యటనకు వెళ్లొచ్చిన ఆయన మళ్లీ బుధవారం వెళ్లనున్నారు. గతంలో వెళ్లిన సందర్భంగా లండన్‌లోని ప్రవాస భారతీయుడి ఓ ప్రతిష్ఠాత్మక సంస్థను కేటీఆర్ ప్రారంభించారు. అక్కడే ప్రవాస భారతీయులు, ప్రముఖ ఐటీ, వ్యాపార సంస్థల ప్రతినిధులతో జరిగిన సెమినార్‌లో కీలకోపన్యాసం చేశారు.
KTR: తాజాగా ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో జూన్ 20, 21 తేదీల్లో జరిగే సదస్సులో కేటీఆర్ పాల్గొననున్నారు. ప్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్‌మెంట్ ఇన్ ఇండియా.. అనే అంశంపై తెలంగాణ అభివృద్ధి కోసం అనుసరించిన విధానాల గురించి ఆయన కీలక ఉపన్యాసం చేయనున్నారు.
KTR: ఈ నేపథ్యంలో కేటీఆర్ బుధవారం (జూన్ 18) రాత్రి బయలుదేరి వెళ్లనున్నారు. ఇంగ్లండ్ పర్యటన అనంతరం తిరిగి జూన్ 24న హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు.