KTR: హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌజ్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అగ్నిప్రమాద ఘటన తెలిసి అత్యంత షాక్‌కు, బాధకు గురయ్యానని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటన చాలా హృదయవిదారకంగా ఉన్నదని తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం, వారి కుటుంబాలకు సానుభూతిని వ్యక్తంచేస్తున్నట్టు తెలిపారు.
KTR: గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. అగ్నిప్రమాదం త్వరలో అదుపులోకి రావాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. బీఆర్ఎస్ శ్రేణులు బాధితులకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.
KTR: ప్రభుత్వం ఈ అగ్నిప్రమాదానికి కారణాలను లోతుగా విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కేటీఆర్ కోరారు. బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. పాతబస్తీతోపాటు నగరంలోని అగ్ని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని, అగ్నిమాపక సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ఈ విషాద సమయంలో హైదరాబాద్ నగర ప్రజలందరూ ఐక్యంగా నిలిచి బాధిత కుటుంబాలకు అండగా నిలవనా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.