KTR:

KTR: హైద‌రాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌పై కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

KTR: హైద‌రాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో ఎంఐఎం, బీజేపీ మాత్ర‌మే పోటీ చేస్తున్నాయి. అటు కాంగ్రెస్ కానీ, ఇటు ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీ కానీ పోటీ చేయ‌డం లేదు. ఈ స్థానం నుంచి ఎంఐఎం అభ్య‌ర్థిగా మీర్జా రియాజ్ ఉల్ అస‌న్ ఎంఫెండ్ పోటీ చేస్తుండ‌గా, బీజేపీ నుంచి గౌత‌మ్‌రావు పోటీ ప‌డుతున్నారు.

KTR: అయితే ఈ ఎన్నిక‌ల్లో స‌రైన సంఖ్యాబ‌లం లేనందున బీఆర్ఎస్ పార్టీ త‌న అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌లేద‌ని కేటీఆర్ శ‌నివారం ఓ మీడియా సమావేశంలో తేల్చి చెప్పారు. అయితే ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌ద‌ని కూడా ప్ర‌క‌టించారు. ఈ నెల 24న జ‌రిగే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ కార్పొరేట‌ర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏ ఒక్క‌రూ ఓటు వేయ‌వ‌ద్ద‌ని పిలుపునిచ్చారు.

KTR: ఎంఐఎం, బీజేపీ రెండు పార్టీలు ఒక్క‌టేన‌ని, ఎవ‌రికీ తాము మ‌ద్ద‌తు ఇవ్వ‌బోమ‌ని, ఎవ‌రికీ ఓటు వేయ‌బోమని కేటీఆర్ తేల్చి చెప్పారు. విప్‌ను ధిక్క‌రించి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేట‌ర్లు ఓట్లు వేయ‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు. దీంతో ఈ ఎన్నికపై కేటీఆర్ నిర్ణ‌యం ప‌నిచేస్తుంద‌ని తెలుస్తున్న‌ది. అదే విధంగా అత్య‌ధిక స్థానాలున్న ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీ మద్ద‌తు ఇస్తుండ‌టంతో ఆ పార్టీ గెలుపు న‌ల్లేరు పై న‌డ‌కేన‌ని తెలుస్తున్న‌ది. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెలుస్తుందో వేచి చూద్దాం మ‌రి.

పార్టీల వారీగా బ‌లాబ‌లాలు ఇలా ఉన్నాయి.
ఎంఐఎం: 49 (1 ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 40 మంది కార్పొరేట‌ర్లు)
బీఆర్ఎస్ – 25 (3 రాజ్య‌స‌భ ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు, 15 మంది కార్పొరేట‌ర్లు)
బీజేపీ : 19 (1 ఎంపీ, 1 ఎమ్మెల్సీ, 19 మంది కార్పొరేట‌ర్లు)
కాంగ్రెస్ : 14 (1 రాజ్య‌స‌భ ఎంపీ, న‌లుగురు ఎమ్మెల్సీలు, 2 ఎమ్మెల్యేలు, 7గురు కార్పొరేట‌ర్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *