KTR: హైదరాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణించడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజుల్లో నగరంలో జరిగిన రెండు భయంకరమైన నేరాలను ఆయన ప్రస్తావించారు.
జ్యువెలరీ షాపులో దోపిడీ, కూకట్‌పల్లిలో బాలిక హత్య
నగరంలో జరిగిన రెండు ఘటనలు ప్రజలను భయపెడుతున్నాయి. గన్‌తో బెదిరించి ఒక జ్యువెలరీ షాపులో దోపిడీ జరిగింది. ఇది సినిమాను తలపించేలా ఉంది. అలాగే, కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలికను కిరాతకంగా హత్య చేయడం ప్రజలను షాక్‌కు గురి చేసింది. ఈ రెండు ఘటనలు నగరంలో భద్రత లోపించిందని స్పష్టంగా చూపిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా భద్రతపై దృష్టి పెట్టడం లేదని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రజలకు భద్రత బదులు భయం ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించి, పౌరులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. “పౌరులకు భద్రత కావాలి, భయం కాదు” అని కేటీఆర్ ఆందోళనను వ్యక్తం చేశారు.