KTR: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాటల యుద్ధం నడుస్తోంది. నారా లోకేష్‌తో తాను రహస్యంగా కలిశారు అని రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తనను లోకేష్‌ను చీకట్లో కలిశానని రేవంత్ రెడ్డి గాలి గన్నయ్య మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
నేను ఏది చేసినా బాజప్తా చేస్తా, బేజాప్తా చేయను అని కేటీఆర్ స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ ఎలాంటి రహస్య సమావేశాలు నిర్వహించనని, అన్నీ బహిరంగంగానే ఉంటాయని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
లోకేష్ నా తమ్ముడు లాంటి వాడు, ఒకవేళ కలిస్తే తప్పేంటి? అని కేటీఆర్ ప్రశ్నించారు. లోకేష్‌ను కలవడం తప్పేమీ కాదని, ఆయన రేవంత్ రెడ్డిలాగా “సంచులు మోసిన దొంగ కాదు” అని ఘాటు విమర్శలు చేశారు. అంతేకాకుండా, లోకేష్ నీలాగా చదువు రాని వాడు కాదుగా అంటూ రేవంత్ రెడ్డి విద్యాభ్యాసంపై కూడా కేటీఆర్ పరోక్షంగా సెటైర్లు వేశారు.
లోకేష్ మీ పెద్ద బాస్ కొడుకే కదా ఏదో దావూద్ ఇబ్రహీం, గుండా చీకట్లో కలిశాను అని ప్రచారం చేస్తున్నవ్ ఏందిరా హౌలా అంటూ కేటీఆర్ తీవ్ర పదజాలంతో రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. లోకేష్ ఒక రాజకీయ నాయకుడి కుమారుడు అని, అలాంటి వ్యక్తిని కలిస్తే దావూద్ ఇబ్రహీం లేదా గుండాను కలిసినట్లు ఎందుకు ప్రచారం చేస్తున్నావని కేటీఆర్ ప్రశ్నించారు.