Ktr: తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
“అధికారంలోకి వస్తే పథకాల వరద పారిస్తామన్నారు. కానీ ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయా?” అని కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో సీఎం కేసీఆర్ రైతుల కోసం భారీ స్థాయిలో నిధులు కేటాయించారని గుర్తుచేశారు. “కేసీఆర్ రూ.73 వేల కోట్ల రైతుబంధు వేశారు. కానీ ఇప్పుడు రైతుబంధు పోయింది. రైతులకు ఇచ్చే బోనస్ కూడా బోగస్ అయింది” అని అన్నారు.
దళితబంధుపై కూడా కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. “దళితబంధు కింద ఒక్కరికైనా రూ.12 లక్షలు ఇచ్చారా? ఇదేనా రేవంత్ ప్రభుత్వం తెచ్చిన మార్పు?” అని విమర్శించారు.
ఓయూ క్యాంపస్ అభివృద్ధిపై మాట్లాడుతూ, “బీఆర్ఎస్ హయాంలోనే ఓయూలో భవనాలు కట్టించాం. కేసీఆర్ కట్టించిన భవనాలను ఇప్పుడు రేవంత్రెడ్డి ప్రారంభిస్తున్నారు. కేసీఆర్పై నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదు” అని హెచ్చరించారు.

