KTR: తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రేవంత్‌కు నిజంగా ధైర్యం ఉంటే లగచర్ల రావాలని అన్నారు. “మీరు రాలేరు.. నేనే కొడంగల్‌కు వస్తా రేవంత్‌కు ధైర్యం ఉంటే పోలీసులతో అడ్డుకోకుండా నాకు అనుమతి ఇవ్వండి. కొడంగల్‌కి వస్తాం, మీ అసలు సంగతి ఏంటో చూస్తాం” అని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే, ప్రజలు నాయకులను నిలదీయాలని సూచించారు.
రుణమాఫీ అంశంపై సవాల్ చేస్తూ, “వందశాతం రుణమాఫీ చేశారని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను” అని కేటీఆర్ ప్రకటించారు. అయితే, తన సవాల్‌కు ఇప్పటివరకు రేవంత్ నుంచి స్పందన రాలేదని విమర్శించారు.
రైతుబంధు నిధులపై విమర్శలు చేస్తూ, “కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు డబ్బులు అసలు BRS హయాంలోనే మంజూరైనవే. కొత్తగా రేవంత్ సర్కార్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు” అని ఆరోపించారు. వానాకాలానికి రావాల్సిన రైతుబంధు కూడా ఇంకా ఇవ్వలేదని, ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధుపై డ్రామా ఆడుతోందని వ్యాఖ్యానించారు.
ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు ప్రజలకు దొరకరని పేర్కొన్న కేటీఆర్, “ఎకరాకు రూ.17,500 ఇచ్చే వరకు రైతులు నెగ్గరగా పోరాడాలి. మహిళలు కూడా తులం బంగారం హామీ ఏమైందని నిలదీయాలి” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.

