KTR: తెలంగాణలో కాంగ్రెస్ పాలన కరవును తెచ్చింది..

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ, సాగునీటిని ఆంధ్రాకు వదిలిపెడుతూ తెలంగాణలో రైతులను కష్టాల్లోకి నెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు రెండు పంటల సాగు సాధ్యమయ్యేలా నీటి సరఫరా చేసామని అన్నారు.

ఈ రోజు మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. సాగునీటి కొరత, విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పండించిన పంట ఎండిపోతుండటంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ హయాంలో ఎండాకాలంలో కూడా చెరువులు నీళ్లతో నిండిపోయేవని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అవే చెరువులు వెలవెలపోతున్నాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు సకాలంలో రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, విత్తనాలు, ఎరువులు, పంట కొనుగోళ్లు పొందుతూ సంతోషంగా ఉండేవారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా, ఇంకా రైతు భరోసా అందలేదని, సాగునీరు లేకపోవడంతో పాటు విత్తనాలు, ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన అన్నదాతలపై కక్ష కట్టినట్లుగా మారిందని విమర్శించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Goa: రాజ్యసభ సభ్యునిపై ముఖ్యమంత్రి భార్య 100 కోట్ల పరువు నష్టం దావా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *