KTR: రేవంత్ చేస్తున్న నిధుల దుర్వినియోగాన్ని కేంద్రం పట్టించుకోవట్లే..

KTR: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ మరియు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన  మాట్లాడుతూ, ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కొనసాగుతోందని ఆరోపించారు. ముఖ్యంగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంలా మారిందని పేర్కొన్నారు.

“అమృత్ టెండర్లు నుండి సివిల్ సప్లయిస్ స్కాం వరకు, కేంద్ర ప్రభుత్వం నిధుల దుర్వినియోగాన్ని పట్టించుకోకుండా, రేవంత్ రెడ్డిని కాపాడుతోంది. అనేక సార్లు ధృవీకరణ పత్రాలతో కేంద్రానికి ఫిర్యాదు చేసినా, బీజేపీ మౌనం పాటిస్తోంది” అని కేటీఆర్ మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రమాదంపై కేంద్రం వెంటనే స్పందించిందని, కానీ సుంకిశాల మరియు ఎస్ఎల్బీసీ ఘటనలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. “రేవంత్ రెడ్డిని బీజేపీ కాపాడుతోందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. సరైన సమయంలో రేవంత్ భాజపాలో చేరతానని హామీ ఇచ్చినందుకే కేంద్రం అతడిని రక్షిస్తోంది అనే అనుమానం కలుగుతోంది” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *