సీఎం రేవంత్ రెడ్ది పై విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాటలన్నీ పచ్చి అబద్ధాలేనంటూ ఫైర్ అయ్యారు. వంద శాతం రుణమాఫీ పూర్తి చేశామన్న సీఎం మాటలన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయిందన్నారు.
చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదని, ఇవ్వాల్సిన రైతుబందు సీజన్ ముగిసినా ఇవ్వలేదంటూ విమర్శించారు. అధికారిక లెక్కల ప్రకారం 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగితే.. అనాధికారికంగా ఇంకా ఎంతమంది అన్నదాతలు ఉన్నారో అని ప్రశ్నించారు.
ఓ వైపు డిసెంబర్ 9న ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని మోసం చేసి.. మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి అందించకుండా దగా చేస్తున్నారని కేటిఆర్ ఫైర్ అయ్యారు.