KTR: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈసారి బీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సోనియాగాంధీ రాసిన లేఖపై స్పందిస్తూ, “ఆ లెటర్లో ఏముందో కూడా రేవంత్‌కి తెలీదు. లేఖలో ఒక్క ప్రశంస కూడా లేదు. అయినా ఆయన ఆస్కార్ వచ్చినట్లు ఫీల్ అవుతున్నారు” అని ఎద్దేవా చేశారు.
రెవంత్ రెడ్డి తన కార్యక్రమానికి సోనియాగాంధీ రాలేకపోతున్నారని చెప్పడంతో, “ఆ లేఖలో సభకు రాలేకపోతున్నానన్న మాట తప్ప మరేదీ లేదు”, అని అన్నారు కేటీఆర్.
అంతేకాకుండా, “లేఖ చదివే తెలివి కూడా రేవంత్‌కి లేదు. ఆయనను చూస్తే జాలేస్తుంది” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
