KTR: తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్‌ఎస్ పార్టీ కొనసాగుతుందనే నమ్మకాన్ని మాజీ మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నడపటానికి దమ్ము కావాలని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తేనే ప్రజల కష్టాలు తగ్గుతాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఎరువుల కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కేటీఆర్, ఎరువుల కోసం రైతులు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లబెల్లిలో ఓ మహిళా రైతుపై NBW కేసు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. “ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి?” అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Chandrababu: ఏపీని హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీగా మారుస్తాం
బీసీ డిక్లరేషన్ ఏమైంది?
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు విషయంలో కాంగ్రెస్‌ను కేటీఆర్ నిలదీశారు. “ప్రభుత్వం ఎటుంటే పోలీసులు అటుంటారు” అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి సాధించారని, మళ్లీ ఆ స్థిరత్వం రావాలంటే బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు.