Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సంచలన కామెంట్స్ చేశారు. ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (UNFPA) ఇండియాకు లింగ సమానత్వ గౌరవ రాయబారిగా నియమితులైన సందర్భంగా, ఆమె సినీ పరిశ్రమలో ఇంకా లింగ వివక్ష ఉందని పేర్కొన్నారు. హీరోలకు లభించే సౌకర్యాలు, గౌరవం హీరోయిన్లకు ఉండవని, ఉదాహరణకు హీరోలకు విలాసవంతమైన కార్లు, లగ్జరీ గదులు కేటాయిస్తారని ఆమె తెలిపారు. ఇలాంటి చిన్న చిన్న తేడాలు కూడా అసమానతలకు అద్దం పడతాయని ఆమె అన్నారు.నెపోటిజం గురించి మాట్లాడుతూ, స్టార్ కిడ్స్‌పై ప్రేక్షకులే ఎక్కువ ఆసక్తి చూపిస్తారని, దానివల్ల మేకర్స్ వారితో సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతారని ఆమె అన్నారు.
బయటివారిగా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్‌గా, నిర్మాతగా ఎదగడం గురించి ఆమె ప్రస్తావించారు. సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లు, ట్రోలింగ్ గురించి కృతి స్పందించారు. నెగటివ్ కామెంట్స్ పెట్టడం ఒక ట్రెండ్‌గా మారిపోయిందని, నిజానిజాలు తెలుసుకోకుండానే ప్రచారం చేస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇది తనను ఎంతో బాధించిందని కూడా చెప్పారు. నటిగానే కాకుండా, నిర్మాతగా కూడా మారిన కృతి సనన్, తాను విభిన్నమైన పాత్రలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. కేవలం గ్లామర్ రోల్స్ కాకుండా, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
ఇది కూడా చదవండి: Anushka: ప్రభాస్ తో మళ్లీ సినిమా చేయాలి అని ఉంది.. కానీ
నటిగా పేరు వస్తే స్టార్‌డమ్ ఆటోమాటిక్‌గా వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.తాను నటిగా, నిర్మాతగా రాణించడమే కాకుండా, బ్యూటీ బ్రాండ్ ‘హైఫన్’తో వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టానని తెలిపారు. తన కెరీర్ ప్లానింగ్ విషయంలో ఎంతో స్పష్టంగా ఉన్నానని, కేవలం డబ్బు కోసం కాకుండా, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.