Kriti Sanon: మహేశ్ బాబు ‘1 నేనొక్కడినే’తో నటిగా కెరీర్ ఆరంభించిన కృతి సనన్ ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ గా స్థిరపడింది. తొలి సినిమాతో పాటు నాగచైతన్యతో నటించిన ‘దోచేయ్’, ప్రభాస్ తో నటించిన ‘ఆదిపురుష్’ చిత్రాలు కూడా కృతికి కలసి రాలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం మంచి పేరు తెచ్చుకుని ‘మిమీ’తో జాతీయ ఉత్తమనటి అవార్డును సైతం అందుకుంది. తాజాగా నిర్మాతగానూ మారింది. రాఘవేంద్రరావు మాజీ కోడలు కనిక థిల్లాన్ కలసి బ్లూ బట్టర్ ఫ్లై ఫిలిమ్స్ పతాకంపై ‘దో పత్తి’ అనే సినిమా నిర్మించింది కృతి సనన్. ఈ మూవీకి కథను కనికనే సమకూర్చారు.
Kriti Sanon: ఇందులో కాజోల్ తో కలసి నటించింది కృతి. శంశాంక చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ సినిమాలో కృతి డ్యూయెల్ రోల్ లో కనిపించనుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 25న స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచారంలో బిజీగా ఉంది కృతి. నటిగా నిర్మాతగా ఏది సంతోషాన్నిస్తోంది అంటే చిత్రసీమలో ఏది వర్కవుట్ అయితే దానిలో మెరుగవ్వాలని అర్థం చేసుకున్నానంటోంది. మరి కృతి నిర్మాతగా సక్సెస్ అవుతుందా? మళ్ళీ తెలుగులో నటిస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.