Krishna River: కృష్ణానదిపై తెలంగాణలోని సోమశిల వద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. దేశంలోనే తొలిసారి రెండంతస్థుల కేబుల్ వంతెన నిర్మాణం ఇదే కానున్నది. ఈ మేరకు బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రవాణా హైవేల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ తాజాగా ఆమోద ముద్ర వేసింది. దీంతో రెండు మూడు నెలల్లో వంతెన నిర్మాణానికి టెండర్లను పిలవనున్నారు.
Krishna River: వాస్తవంగా మూండేండ్ల క్రితమే ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉండగా వివిధ కారణాల రీత్యా అది ఆనాడు కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ ప్రాజెక్టు రద్దయింది. ఇటీవల దాన్ని నేషనల్ హైవేస్ ఒరిజినల్ జాబితాలోకి రావడంతో ప్రాజెక్టు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
Krishna River: 800 మీటర్ల నిడివి కలిగి ఉండే ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1,062 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణంతో కృష్ణానది ఈవల మల్లేశ్వరం నుంచి ఆవలిలో ఏపీలోని సంగమేశ్వర పుణ్యక్షేత్రాలను కలుపుతూ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరోమార్గం ఏర్పడనున్నది.
Krishna River: ఇదే మార్గం నుంచి తెలంగాణ నుంచి తిరుపతి మార్గం కూడా దగ్గరకానున్నది. ప్రస్తుతం నంధ్యాల, తిరుపతికి వెళ్లాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. కొల్లాపూర్ మీదుగా కృష్ణా నదిని దాటేలా కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే తెలంగాణ నుంచి సుమారు తిరుపతికి 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.