Krishna: తన అభిమాన హీరో నటశేఖర కృష్ణను వైవిధ్యమైన పాత్రల్లో చూపించాలని తపించారు నందిగం రామలింగేశ్వరరావు… తన ఫేవరెట్ స్టార్ తో తీసిన ‘కిరాయి కోటిగాడు’తో మంచి విజయం సాధించారు. తరువాత ఆ చిత్రంలో జోడీ కట్టిన కృష్ణ, శ్రీదేవితోనే ‘కంచుకాగడా’ అనే భారీ చిత్రం తెరకెక్కించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆ పై కృష్ణ, రాధ జంటగా ‘దొంగోడొచ్చాడు’ తీశారు. తరువాత మరికొందరు హీరోలతోనూ చిత్రాలు నిర్మిస్తూ సాగారు రామలింగేశ్వరరావు. ఆయన నిర్మించిన ‘పెళ్ళి’ సినిమా ఘనవిజయం సాధించింది.
ఇది కూడా చదవండి: Pranaya Godari: ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన ప్రణయ గోదారి టీమ్
Krishna: తన అభిమాన హీరో కొడుకు మహేశ్ బాబుతో ‘మురారి’ చిత్రాన్ని భారీగానే నిర్మించారు. ఈ సినిమా సైతం వైవిధ్యంతో ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంది. ఆ తరువాత ఎందువల్లో రామలింగేశ్వరరావు అంతగా సినిమా నిర్మాణంతో సాగలేదు. డిసెంబర్ 17న రామలింగేశ్వరరావు పుట్టినరోజు. ఇప్పటికీ తన అభిమాన హీరోను తలచుకుంటూ ఉండే రామలింగేశ్వరరావు మళ్ళీ సినిమా తీస్తారేమో చూడాలి.

