Krish Jagarlamudi

Krish Jagarlamudi: ఎట్టకేలకు హరిహర వీరమల్లు సినిమాపై స్పందించిన క్రిష్

Krish Jagarlamudi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా మొదటినుంచి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేపింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి, ఎక్కువ భాగం షూట్ చేసిన డైరెక్టర్ క్రిష్ సైలెంట్‌గా తప్పుకోవడంతో ఎన్నో రకాల కథనాలు బయటకు వచ్చాయి.

ఒక దశలో పవన్ కల్యాణ్‌, క్రిష్ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ క్రిష్ ఎక్కడా స్పందించలేదు. బిజీగా ఇతర సినిమాలతో మునిగిపోయాడు. అయితే తాజాగా క్రిష్ స్పందించడం వల్ల ఆ వార్తలకు ముగింపు లభించింది.

క్రిష్ ట్వీట్‌తో క్లారిటీ

సినిమా రిలీజ్‌కి రెండు రోజుల ముందు క్రిష్ ట్వీట్ చేసి తన మనసులోని మాట బయటపెట్టాడు. “ఈ సినిమా నాకు ఒక పెద్ద యుద్ధాన్ని నేర్పించింది. దర్శకుడిగానే కాదు, చరిత్ర పరిశోధకుడిగా, నిజాలను వెలికితీసే ప్రయత్నం చేసిన వ్యక్తిగా, ఓ అద్భుత ప్రపంచాన్ని చూపించాలనే కల కలిగిన వ్యక్తిగా ఈ సినిమాను చూసాను” అంటూ రాశాడు.

ఇది కూడా చదవండి: Hari Hara Veeramallu: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుకు తెలంగాణ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌

హీరో పవన్ కల్యాణ్‌, నిర్మాత ఏఎం రత్నం గురించి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “పవన్ లేకపోతే వీరమల్లు లేదు” అని క్రిష్ స్పష్టంగా చెప్పాడు. అయితే జ్యోతికృష్ణ లేదా మిగిలిన టీమ్ గురించి ఆయన ప్రస్తావించలేదు.

టీమ్‌కి మధ్య ఎలాంటి గొడవలు లేవు

ఇకముందే నిర్మాత ఏఎం రత్నం, పవన్ కల్యాణ్ పలుమార్లు క్రిష్ పనితనాన్ని మెచ్చుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కూడా క్రిష్‌ను గుర్తు చేసుకుని థ్యాంక్స్ చెప్పాడు. ఇప్పుడు క్రిష్ స్పందించడంతో, ఆయన, టీమ్ మధ్య ఎలాంటి గొడవలూ లేవనే క్లారిటీ వచ్చింది.

సంక్షేపంగా చెప్పాలంటే, క్రిష్ సైలెంట్‌గా తప్పుకున్నా, పవన్ మరియు క్రిష్ మధ్య మంచి అనుబంధం ఉందని ఇప్పుడు అందరికీ స్పష్టమైంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *