Kota Srinivasa Rao

Kota Srinivasa Rao: కోట మృతిపై చిరు, బాలయ్య, ఎన్టీఆర్, ఆర్జీవీ, రవి తేజ.. ట్వీట్స్ !

Kota Srinivasa Rao: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు (83) ఇక లేరు. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కోట గారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య, చిరంజీవి, ఎన్టీఆర్, రవితేజ, ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్స్ చేశారు.

ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు గారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. Bala Krishna

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *