Komdal Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే అత్యంత ఫిట్‌నెస్ కలిగిన ముఖ్యమంత్రి అని ఆయన సోదరుడు అనుముల కొండల్ రెడ్డి ప్రశంసించారు. హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ఆడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు
56 ఏళ్ల వయసులోనూ సీఎం రేవంత్ రెడ్డి చూపించిన ఉత్సాహం, శారీరక దృఢత్వం అందరికీ స్ఫూర్తిదాయకమని కొండల్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 38 ఏళ్ల మెస్సీతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ, బంతిని డ్రిబ్లింగ్ చేస్తూ గోల్స్ చేయడం ద్వారా సీఎం రేవంత్ తన ఫిట్‌నెస్‌ను చాటుకున్నారని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు.
నాయకులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపితే, ప్రజల్లో కూడా ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన పెరుగుతుందని కొండల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే నాయకత్వం దేశానికి అవసరమని, ఆరోగ్యవంతమైన భారత నిర్మాణానికి ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు.
ఇలాంటి ఉత్సాహభరితమైన నాయకత్వానికి మరింత శక్తి, ఆరోగ్యం కలగాలని కొండల్ రెడ్డి ఆకాంక్షించారు.
