Konda Surekha: తనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలపై రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఓ నటి విడాకుల అంశంలో సురేఖ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు విచరాణ జరిపిన నాంపల్లి కోర్టు ఆగస్టు 21లోగా మంత్రి సురేఖపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలపై మంత్రి సురేఖ తాజాగా స్పందించారు.
Konda Surekha: ఈ కేసులు, కొట్లాటలు నాకు కొత్త కాదు.. నా జీవితమే ఒక పోరాటం.. కొండా సురేఖ పేరు అనగానే కొందరికి ఎందుకంత ఉత్సాహం.. నాకు ఈ దేశ న్యాయ వ్యవస్థపైన అపారమైన గౌరవం ఉన్నది.. చట్టం తన పని తాను చేసుకుపోతున్నది.. అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఏ కేసులో అయినా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమని పేర్కొన్నారు.
Konda Surekha: కానీ, కొందరు కొండా సురేఖ కేసులో కోర్టు తీర్పు ఇచ్చిందని పత్రికల్లో, మీడియాలో వార్తలను ప్రసారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తంచేశారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని మంత్రి తెలిపారు. ఇది జరిగి కూడా రెండు రోజులు అయిందని తెలిపారు. ఎందుకంత ఉత్సాహం అని ఆమె ప్రశ్నించారు.