konda surekha: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి సురేఖ విమర్శలలో ముఖ్యంగా టార్గెట్ అయినది స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఆయన గురించి మాట్లాడుతూ, “కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషి. నేనిప్పుడు మంత్రిని కావడంతో నా ముందుకు రావడానికే ఆయనకు నామోషీగా అనిపిస్తోంది.
అందుకే తప్పుడు ప్రచారం చేస్తూ, నా మంత్రి పదవి పోతుందని రూమర్లు పెడుతున్నాడు,” అంటూ ఆరోపించారు. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు వెళ్లి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆమె వెల్లడించారు. తెలుగుదేశం పార్టీని నడిపించిన స్టైల్లో ఇక్కడ కూడా రాజకీయాలు చేయాలని ఆయన చూస్తున్నారు,” అని వ్యాఖ్యానించారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ,
“నా అదృష్టం వల్లే నేను మంత్రిని అయ్యాను. కడియం శ్రీహరి కూడా తన అదృష్టంతో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నన్ను దిగిపోవాలంటే ఎలా?” అని ప్రశ్నించారు. తన కుటుంబంపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ,
“నా కూతురు ఎమ్మెల్యే కాలేకపోయింది అంటే అది ఆమె అదృష్టం కాదు. అలాగే కడియం శ్రీహరి కుమార్తె ఎంపీ అయ్యింది అంటే అది ఆమె అదృష్టం. కానీ నేను ఆమె ఎంపీ పదవి తీయాలనుకున్నానా?” అని ప్రశ్నించారు.