ONGC Gas Leak

Konaseema collector: 30 ఏండ్ల బావి..100 అడుగుల ఎత్తులో మంటలు

Konaseema collector: కోనసీమ జిల్లా మల్కిపురం మండలం ఇరుసుమండలో ONGC గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

1993 నుంచి ఆపరేషన్‌లో ఉన్న ONGC బావిలో అకస్మాత్తుగా బ్లో అవుట్ చోటుచేసుకుంది. సుమారు 2,500 మీటర్ల లోతు నుంచి గ్యాస్ వెలువడుతుండగా అనూహ్యంగా ఎక్కువ ఒత్తిడితో గ్యాస్ బయటకు రావడంతో ప్రమాదం జరిగింది.ప్రారంభంలో దాదాపు ఒక గంట పాటు గ్యాస్ మాత్రమే లీక్ కాగా, అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ మంటలు సుమారు 100 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *