Komatireddy Venkata Reddy: తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అవమానం జరిగింది. బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో మరో సహచర మంత్రి అయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైఖరితో తనకు అవమానం జరిగిందని కోమటిరెడ్డి అలిగినట్టు సమాచారం. హెలికాప్టర్‌లో ఇద్దరూ వెళ్లాల్సి ఉండగా, ముందుగా వచ్చిన కోమటిరెడ్డి.. ఉత్తమ్ కోసం వేచి చూశారు. ఎంతసేపయినా రాకపోవడంతో అసహనంతో వెళ్లిపోయారు.
Komatireddy Venkata Reddy: ఈ రోజు (జూలై 29) నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పర్యటించాల్సి ఉన్నది. అదే విధంగా నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిండటంతో ఇద్దరు మంత్రులు గేట్లు ఎత్తాల్సి ఉన్నది. షెడ్యూల్ ప్రకారం 9గంటలకే మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ అక్కడికి చేరుకున్నారు. కానీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం 10 గంటలకు వచ్చారు. ఈలోగా ఎంతసేపు ఉత్తమ్ కోసం ఎదురు చూడాలి అంటూ అలిగి కోమటిరెడ్డి వెళ్లిపోయినట్టు సమాచారం.
Komatireddy Venkata Reddy: ఆ తర్వాత వచ్చిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్కరే వెళ్లిపోయారు. కోమటిరెడ్డి రాకకోసం వేచి చూడకుండానే వెళ్లిపోయారని సమాచారం. అలిగి వెళ్లిపోయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన రెండు పర్సనల్ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశారని సమాచారం. సంబంధిత అధికారలు ఎంతగా ఫోన్ చేసినా వెంకట్‌రెడ్డి ఫోన్లు కలవలేదని తెలిసింది.