Komatireddy Venkat Reddy: తెలుగు సినిమా రంగంలో కార్మికుల వేతనాల పెంపు కోసం జరుగుతున్న బంద్ పై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. షూటింగ్స్ ఆపేయడం కంటే, పని చేస్తూనే తమ డిమాండ్స్ నెరవేర్చుకోవాలని కార్మికులకు సూచించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
ఇటీవల 24 సినీ కార్మిక సంఘాలు వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తూ సినిమా షూటింగ్స్ నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు మంత్రితో భేటీ అయ్యారు. సమావేశంలో నిర్మాతలు దిల్‌రాజు, సుప్రియ, జెమినీ కిరణ్, దామోదర్ ప్రసాద్ మరియు మరికొందరు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Nidhhi Agerwal: హీరోయిన్ కి గవర్నమెంట్ వెహికల్.. కారణం ఇదేనట
మంత్రి కోమటిరెడ్డి, నిర్మాతలు మరియు కార్మిక ప్రతినిధులకు ఒకరి పరిస్థితి మరొకరు అర్థం చేసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు. అలాగే మంగళవారం మరోసారి చర్చించుకోవాలని సూచించారు.
ఇక కార్మికులు తమ డిమాండ్ల కోసం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని కమిషనర్ ఆఫీసుకూ వెళ్లారు. మరోవైపు, ఈ వేతన వివాదంపై నిర్మాతలు చిరంజీవితో కూడా సమావేశమయ్యారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.