Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వరుస విమర్శలకు దిగుతున్న రాజగోపాల్‌రెడ్డి.. రేవంత్‌రెడ్డి మాట తీరుపై వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా జర్నలిస్టులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని ఇటీవలే రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
Komatireddy Raj Gopal Reddy: సీఎం రేవంత్‌రెడ్డి తన భాష మార్చుకోవాలని తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సూచించారు. తన హావభావాలను కూడా మార్చుకోవాలని చెప్పారు. రేవంత్‌రెడ్డి గంటలు గంటలు మాట్లాడకుండా, అదే శ్రద్ధ పనిపై చూపించాలని కోరారు. ఇంకో మూడున్నరేళ్లు ఆయనే సీఎం అని, తర్వాత ఎవరు అనేది అధిష్ఠానం, ప్రజలు నిర్ణయిస్తారని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.
Komatireddy Raj Gopal Reddy: గతంలో కూడా పదేండ్లు తానే సీఎంనని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా రాజగోపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో పదేండ్లు ఒక్కరే సీఎంగా ఎలా ఉంటారని, అధిష్ఠానం ఉంటుందనే విషయాన్ని మరువొద్దని చురకలు అంటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందితే సీఎం అభ్యర్థిని పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని చెప్పారు.
Komatireddy Raj Gopal Reddy: మంత్రి పదవి ఇస్తామంటేనే తాను బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో తాను చేరానని ఇటీవలే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. ఇప్పుడు తనకంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారని, తనకు ఉత్త చేతులు చూపారని తెలిపారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, మునుగోడు ప్రజలే ముఖ్యమని, అవసరమైతే మరోసారి మునుగోడు ప్రజల కోసం తాను రాజీనామాకు కూడా సిద్ధమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.