Komatireddy Raj Gopal Reddy: సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి విరుచుకుపడ్దారు. గతంలోనే పలుమార్లు కాంగ్రెస్ సర్కార్ వైఖరిపై, వైఫల్యాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించిన ఆయన తాజాగా ఉద్యోగాల కల్పన విషయంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంపై ఆయన ధ్వజమెత్తారు. మంత్రి పదవి దక్కలేదని కొందరు విమర్శకులు ఆరోపించినా, తనకు పదవి ముఖ్యం కాదని, ప్రజలే ముఖ్యం కాదంటూ ఆయన పలుమార్లు చెప్పుకుంటూ వచ్చారు.
Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు న్యాయం జరుగుతుందని తెలంగాణ నిరుద్యోగులు భావించారని తెలిపారు. కానీ, ఆ స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలను సర్కార్ ఇవ్వలేదని మండిపడ్డారు. నిరుద్యోగులను గాలికి వదిలేయొద్దని, వారికి దారి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని హితవు పలికారు.
Komatireddy Raj Gopal Reddy: నేపాల్ తరహాలో యువత తిరగబడి మన ప్రభుత్వాన్ని కూడా కూల్చేయడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాధించినట్టు ఎక్కడా లేదని, దానిని గమనంలో ఉంచుకోవాలని సర్కారు పెద్దలకు సూచించారు. నేపాల్‌లో అసహనంతో యువతే తిరగబడి అక్కడి ప్రభుత్వాన్ని కూలగొట్టిందని చెప్పారు.