Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కల నెరవేరుతుందా? త్వరలో ఆయనను మంత్రి పదవి వరిస్తుందా? కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇవే సంకేతాలు రాజగోపాల్‌రెడ్డికి చేరాయని కూడా తెలుస్తున్నది. గత కొన్నాళ్లుగా ఆయన లాబీయింగ్ పనిచేసిందని, అందుకే రాజకీయ విమర్శలు చేయకుండా, ఆచీతూచి అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Komatireddy Raj Gopal Reddy: తనకు మంత్రి పదవి వస్తుందని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బహిరంగంగానే చెప్పుకున్నారు. ఇటీవల గత కొద్ది రోజులుగా గప్‌చుప్‌గా లాబీయింగ్ చేసుకున్నారని, తరచూ ఢిల్లీ పర్యటనలతో అధిష్టానం పెద్దలతో అనేక చర్చలు జరిపి వారిని ఒప్పించేలా చేసినట్టు తెలిసింది. వారిచ్చిన హామీతోనే ఆయన అంత నమ్మకంగా తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నట్టు తెలుస్తున్నది.
Komatireddy Raj Gopal Reddy: మరోచోట రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తాను ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుంటానని, పార్టీ కోసం తాను చేసిన కృషిని అధిష్ఠానం గుర్తించిందనిచ త్వరలోనే శుభవార్తను వింటారని, మంత్రిగా బాధ్యతలు చేపడుతానని చెప్పుకున్నారు. మంత్రినయ్యాక ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు రాష్ట్ర అభివృద్ధికి తన వంతుగా సహకారం అందించేందుకు ముందస్తు ప్లాన్ వేసుకుంటున్నట్టు తెలిపారు.
Komatireddy Raj Gopal Reddy: ఇదిలా ఉండగా, రాజగోపాల్‌రెడ్డి సోదరుడైన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని బాధ్యతల నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతూ వస్తున్నది. ఆయన స్థానంలోనే రాజగోపాల్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రకటించారు. ఈ దశలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన వ్యాఖ్యలను బట్టి అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీ ఉన్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

