Kollu Ravindra: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం విషయంలో మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంగా అభివర్ణిస్తూ, ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసేంతటి ఘనత సాధిస్తుందని అన్నారు.
“లిక్కర్‌తో పాటు పలు స్కాంలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ రూ.3 వేల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని అంచనా. ఇదే స్థాయిలో ఇంకో పెద్ద తిమింగలం త్వరలో బయటపడనుంది” అని హెచ్చరించారు.
వైసీపీ పాలనలో జరిగిన అక్రమాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు అని ఆరోపించారు. పెట్టుబడులను అడ్డగించేందుకు అధికార పార్టీ కొందరు వ్యక్తులు విదేశీ కంపెనీలకు ఈ-మెయిల్స్ పంపిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.