Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణ వేగంగా పూర్తవుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి పాటకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్ రెండో పాటను విడుదల చేశారు, ఇది కూడా అద్భుతమైన సంగీతంతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఎంఎం కీరవాణి, చంద్రబోస్ ఈ పాటకు సంగీతం, సాహిత్యం అందించగా, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల తమ గానంతో ప్రాణం పోశారు.

“కోర కోర మీసాలతో… కొదమ కొదమ అడుగులతో…” అంటూ సాగిన ఈ పాటలో పవన్ కళ్యాణ్ యోధుడిగా, నిధి అగర్వాల్ రాణిగా మెస్మరైజ్ చేస్తున్నారు. వారి లుక్స్‌ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ చిత్రంలో బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తుండగా, అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో, ఏ. దయాకర్ రావు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

‘హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ఈ చిత్రం మార్చి 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kiran Abbavaram: పవన్ ఇమేజ్ పై ఆధారపడ్డ కిరణ్ అబ్బవరం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *