Virat Kohli: జూన్ 20 భారత్ – ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. రోహిత్ రిటైర్ తో ఈ కఠినమైన టూర్ కు యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. రోహిత్ బాటలోనే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇంగ్లాండ్‌లో కీలకమైన సిరీస్‌కు ముందు ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్ల రిటైర్మెంట్ దేశానికి షాక్ ఇచ్చింది. భారత యువ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉన్నాడు. ఐపీఎల్ ఆడిన తర్వాత కోహ్లీ లండన్ తిరిగి వెళ్లాడు.
కోహ్లీ ఇంట్లో 2 గంటల పాటు..:
రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ.. విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ సిరీస్ పై దృష్టి సారించాడు. కొత్త టెస్ట్ కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ సహా మరికొంతమంది ఆటగాళ్లను కోహ్లీ లండన్‌లోని తన ఇంటికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ మీటింగ్ లో కోహ్లీ ఆటగాళ్లకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. టెస్టుల్లో కోహ్లీకి అదిరిపోయే రికార్డులు ఉన్నాయి. కోహ్లీ అనుభవం యంగ్ ప్లేయర్లకు కలిసిరానుంది.
టీం ఇండియాలో ఒక మార్పు:
ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్ ప్రారంభానికి 2 రోజుల ముందు మరో ఆటగాడు సడెన్ గా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత టెస్ట్ జట్టులో పేసర్ హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నాడు. 18 మంది సభ్యుల జట్టులో రాణాను మొదట ఎంపిక చేయలేదు. కానీ అతన్ని మంగళవారం జట్టులో చేర్చారు.
