Kodandaram: ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తదనంతరం ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. తమ నియామకంపై కోర్టు స్టేమాత్రమే ఇచ్చిందని, కౌంటర్ దాఖలు చేశామని, దీనిని ప్రభుత్వమే చూసుకుంటుందని తేల్చి చెప్పారు. తన ప్రయాణం ఎమ్మెల్సీతోనే మొదలు కాలేదని స్పష్టం చేశారు.
Kodandaram: ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి తాను ఇక్కడికి వచ్చానని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. తన ప్రయాణం ఇక్కడితో ఆగేది కాదని, ప్రభుత్వంతో విభేదాలు లేవని, విచారణ తర్వాత తుది తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆయనతోపాటు అమీర్ అలీఖాన్ సభ్యత్వాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
Kodandaram: గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్‌లకు ఇటీవలే సుప్రీంకోర్టు షాకిచ్చింది. శాసనమండలి సభ్యులుగా వారి నియామకాన్ని రద్దు చేసింది. వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయడమే తప్పు అని న్యాయస్థానం పేర్కొన్నది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును విభేదిస్తూ మధ్యంతర ఉత్తర్వును సుప్రీంకోర్టు సవరించింది.