Kodali Nani

Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు

Kodali Nani: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజా సమాచారం మేరకు, ఆయనకు తీవ్రమైన గుండెపోటు సంభవించిందని, వైద్యులు అత్యవసరంగా చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఇంకా స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు. అయితే, ఆస్పత్రి వర్గాల ప్రకారం, ఆయనను ఐసీయూలో ఉంచి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ వార్తతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పార్టీ నాయకులు, అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: KTR: కేటీఆర్‌పై కేసు నమోదు

గత కొంతకాలంగా కొడాలి నాని రాజకీయ కార్యక్రమాల్లో అంతగా కనిపించకుండా ఉండటం, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారనే వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజా ఘటనతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన ఆయన, గుడివాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తుండగా, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆస్పత్రికి చేరుకుని ఆయన ఆరోగ్యంపై సమాచారం తెలుసుకుంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AP News: అన్నం లో విషం.. రంగయ్యకు రోజు ఆ పార్సెల్.. చంపింది పులివెందుల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *