Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ఆపరేషన్ విజయవంతం అయింది. ముంబాయిలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో సుదీర్ఘంగా నానికి సర్జరీ నిర్వహించారు. కొడాలి నానికి ఆపరేషన్ విజయవంతం కావాలని ఆయన అభిమానులు పూజలు చేసారు.
ఆపరేషన్ తరువాత మాజీ సీఎం జగన్ వైద్యుల తో మాట్లాడారు. వైద్యానికి నాని రెస్పాండ్ అవుతున్నారని..కుటుంబ సభ్యులతో నాని మాట్లాడినట్లు వైద్యులు వెల్లడించారు. మూడు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. నాని ఆపరేషన్ సక్సెస్ అయినట్లు కుటుంబ సభ్యులు వైసీపీ నేతలకు సమాచారం ఇచ్చారు.
సర్జరీ సక్సెస్
కొడాలి నానికి గుండె బైపాస్ సర్జరీ సక్సెస్ అయింది. ముంబాయిలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో ఆయనకు కొద్ది సేపటి క్రితం బైపాస్ సర్జరీ పూర్తి చేసారు. దాదాపు ఎనిమిది గంటల పాటు వైద్యుల టీం ఆపరేషన్ నిర్వహించింది. కాగా, ఆపరేషన్ సక్సెస్ అయినట్లు వైద్యులు ప్రకటిం చారు. కొద్ది సేపటి క్రితమే నాని తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ విషయాన్ని ఫ్యామిలీ సభ్యులు తమ బంధువులు. పార్టీ నేతలకు వెల్లడించారు. హైదరాబాద్ ఏఐజీలో చికిత్స తీసుకు న్న నానికి వైద్యుల సూచన మేరకు ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ కు తరలించారు. అక్కడ ప్రఖ్యాత వైద్యులు చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో బైపాస్ సర్జరీ చేసారు.
జగన్ ఆరా
నాని ఆరోగ్య పరిస్థితి పైన మాజీ సీఎం జగన్ నిరంతరం వాకబు చేస్తున్నారు. ఈ ఉదయం నాని కుటుంబ సభ్యులతో జగన్ మాట్లాడారు. అటు వైద్యులు సైతం బైపాస్ తరువాత నాని కోలుకుం టారని భరోసా ఇచ్చారు. ఇప్పుడు సర్జరీ తరువాత నాని త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ాస్పత్రి వైద్యులు చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం నాని అస్వస్థతకు గురైన సమయంలో గుండె సంబంధిత పరీక్షలు చేయగా.. మూడు కవాటాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించారు. తొలుత స్టంట్స్ వేయాలని భావించినా.. మూడు వాల్వ్స్ లో బ్లాకులు ఉండటంతో సర్జరీ అవసరమని నిర్దారించారు. దీంతో, కొడాలి నానిని ప్రత్యేక ఫ్లైట్ లో ముంబాయికి తరలించారు. 2024 ఎన్నికలకు ముందు నుంచే నాని అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లో తరచూ చెకప్ చేయించుకొని చికిత్స తీసుకుంటున్నారు.
అభిమానులు హ్యాపీ
గత వారం ఛాతీలో నొప్పి రావటంతో ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో చేసిన పరీక్షల్లో గుండెలోని మూడు కవాటాల్లో బ్లాకులు ఉన్నట్లు గుర్తించారు. వీటి కోసం బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్దారించారు. మాజీ సీఎం జగన్ వైద్యులతో మాట్లాడిన సమయంలో వెంటనే సర్జరీ చేయించాలని సూచించారు. నానికి ఆపరేషన్ సమయంలో ఆయన అభిమానులు దేవాలయాల్లో పూజలు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. నానికి చేస్తున్న సర్జరీ విజయవంతం అవ్వ టంతో పాటుగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పుడ సర్జరీ విజయ వంతం అయిందని సమాచారం అందటంలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.