September 1st Changes

September 1st Changes: సెప్టెంబర్‌ 1 నుంచి మారిన కీలక మార్పులు ఇవే.. డోన్ట్ మిస్

September 1st Changes: సెప్టెంబర్ నెల ప్రారంభమైంది. కొత్త నెల మొదలవుతున్న సమయంలో ప్రభుత్వ, ఆర్థిక, వాణిజ్య రంగాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఇవి సాధారణ వినియోగదారులు, ఉద్యోగులు, వ్యాపారులు అందరినీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ నెలలో అమలులోకి వచ్చిన కీలక నిబంధనలు, గడువులు, ధరల మార్పుల గురించి తప్పక తెలుసుకోవాలి.

వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి

సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో వెండి వస్తువుల స్వచ్ఛత, నాణ్యతపై వినియోగదారులకు స్పష్టత లభిస్తుంది. ఇప్పుడు వెండి ఆభరణాలపై 900, 800, 835, 925, 970, 990 వంటి స్వచ్ఛత స్థాయిని సూచించే HUID (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్)తో ముద్ర ఉంటుంది. ఈ నిర్ణయం వ్యాపారాన్ని పారదర్శకంగా చేయడం, మోసాలను అరికట్టడం లక్ష్యంగా తీసుకున్నారు.

ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) ఫైలింగ్ గడువు

ఈ సంవత్సరం టెక్నికల్ కారణాల వల్ల జూలై 31న ముగియాల్సిన ఐటీఆర్ ఫైలింగ్ గడువును సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించారు. కాబట్టి పన్ను చెల్లింపుదారులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే ఫైలింగ్ పూర్తి చేయాలి. అలాగే ఆడిటింగ్ అవసరమున్న పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను అక్టోబర్ 31, 2025 లోపు ఫైల్ చేయాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: AP Pensions: ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణి.. ఇప్పటికే 60% పింఛన్ల పంపిణీ పూర్తి

రిజిస్టర్డ్ పోస్ట్‌కు వీడ్కోలు

భారత పోస్టల్ విభాగం దశాబ్దాలుగా కొనసాగుతున్న రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను సెప్టెంబర్ 1 నుంచి నిలిపివేసింది. ఈ సేవ వినియోగం తగ్గిన కారణంగా, దీనిని స్పీడ్ పోస్ట్‌తో విలీనం చేశారు. ఇకపై రిజిస్టర్డ్ పోస్ట్ అవసరాలకు వినియోగదారులు స్పీడ్ పోస్ట్‌ను మాత్రమే ఉపయోగించాలి.

ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గింపు

సెప్టెంబర్ 1 నుంచి వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు రూ. 51.50 తగ్గాయి. ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1580గా ఉంది. అయితే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎటువంటి మార్పు లేదు.

స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యలు

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మోసపూరిత, స్పామ్ కాల్స్‌పై సెప్టెంబర్ 1 నుంచి కఠిన చర్యలు ప్రారంభించింది. వినియోగదారులను వేధించే స్పామ్ కాల్స్, మెసేజ్‌లు పంపించే సంస్థలను రెండు సంవత్సరాల వరకు బ్లాక్‌లిస్ట్ చేయనున్నట్లు టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.

SBI క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ మార్పులు

భారత అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ నిబంధనల్లో మార్పులు చేసింది. ఇప్పుడు డిజిటల్ గేమింగ్, ప్రభుత్వ వెబ్‌సైట్లలో చెల్లింపులు, కొన్ని ప్రత్యేక మర్చంట్ల వద్ద కొనుగోళ్లకు రివార్డ్ పాయింట్స్ ఇవ్వబడవు.

పెన్షన్ విధాన మార్పులు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)లోకి మారడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు కల్పించారు. ఈ నిర్ణయం వేలాది ఉద్యోగులకు ఆర్థిక భద్రత కలిగించనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *