CBI

CBI: తెలంగాణలోకి మళ్లీ అడుగుపెట్టనున్న సీబీఐ!! ఎందుకో తెలుసా?

CBI: కాళేశ్వరం పై కాంగ్రెస్ప్ర‌ భుత్వ నిర్ణ‌యంతో మ‌ళ్లీ తెలంగాణ‌లోకి సీబీఐ అడుగుపెట్ట‌బోతోంది. సీబీఐని గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం రాష్ట్రంలో అడుగు పెట్ట‌కుండా నిషేధించింది. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం సీబీఐని త‌మ జేబుసంస్థ‌గా వాడుకొని న‌చ్చ‌ని రాజ‌కీయ పార్టీలు, న‌చ్చ‌ని వ్య‌క్తుల‌పై దాడులు చేయ‌స్తోంద‌ని ఆరోపిస్తూ నాటి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ నిషేధం విధించారు. అయితే ఆనాడు రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా ప్ర‌భుత్వమే అడ్డుకుంటే ఇప్పుడు ప్ర‌భుత్వ‌మే సీబీఐని కోరుకుంటోంది. నిజానికి రాష్ట్ర‌ ప్రభుత్వం చేతిలో సీఐడీ ఉంది, ఇతర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ప్రత్యేకంగా సిట్ ని కూడా ఏర్పాటు చేయవచ్చు. అయినా సీబీఐకి ఇవ్వాల‌న్న నిర్ణ‌యం తీసుకునేందుకు కార‌ణం.. కేసీఆర్ ను రాజకీయంగా తాము ఇబ్బంది పెట్టామన్న విమర్శ తమకు రాకూడదని రేవంత్ స‌ర్కారు భావిస్తుండ‌డమేన‌ని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Revanth Reddy: మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దుమీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు

దీంతో ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ వైపు ఇపుడు అందరి చూపూ ఉంది. సీబీఐకి ఒక కేసుని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఇస్తామని అంటోంది. దాంతో ఈ కేసుని టేకప్ చేసి నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కచ్చితంగా సీబీఐ వంటి సంస్థకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ ఏ కేసునైనా విచారణకు స్వీకరిస్తుంది పైగా లక్షా నలభై వేల కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఒక ప్రాజెక్ట్ అని చెబుతున్నారు కాబట్టి ఎంతో బరువైన కేసు ఇది అని అంటున్నారు ఈ నేపథ్యంలో త్వరలోనే సీబీఐ ఎంట్రీ ఉండొచ్చున‌ని అంటున్నారు.

ఈట‌ల‌కు ఇబ్బందిక‌రం..
సీబీఐ ఎంట్రీ ఇస్తేనే ఈ కేసుకు సంబంధించి ఆనాడు ప్రభుత్వంలో ఉన్నవారదరినీ విచారణ చేస్తుందంటున్నారు. అయితే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే ఆర్థిక మంత్రిగా ఈటట‌ల రాజెందర్ ఉన్నారు జలవనరుల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. ఈ కేసులో విచారణ జరిగితే ఈట‌లను కూడా ప్రశ్నిస్తారని అంటున్నారు. అయితే ఈట‌ల ప్రస్తుతం మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా కూడా ఉన్నారు. బీజేపీలో కీలక నేతగా ఉన్నారు.

దీంతో బీజేపీకి చెందిన ఎంపీని కూడా సీబీఐ విచారిస్తుందా అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. వాస్త‌వానికి ఈటలకు సొంత పార్టీలో ప్రత్యర్ధులు ఉన్నారని ప్రచారంలో ఉంది. ఆ మధ్య కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఈటెలగా ఒక ఎపిసోడ్ నడిచింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి మీద సీబీఐకి విచారణకు అప్పగించడం మంచి పరిణామం అని బండి సంజయ్ చేసిన ట్వీట్ ఇపుడు చర్చనీయాంశం అవుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *