Nara Lokesh: ప్రధాని నరేంద్ర మోదీ మన దేశపు క్షిపణి(Missile). పాకిస్తాన్ నుండి 100 మంది వచ్చినా, భారతదేశాన్ని కదిలించలేరు – అన్నీ ఉత్సాహపూరితంగా వెల్లడించిన మాటలు ఇవే. శుక్రవారం జరిగిన అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ జ్వాలాముఖి లాంటి ప్రసంగం చేశారు.
అమరావతి నమః నమః అంటూ ప్రారంభించిన ప్రసంగంలో, ఇప్పుడు అమరావతిని ఆపడం అసాధ్యం. ఇది ప్రజల ఆశల రాజధాని, ఏపీ తిరిగి వేగంగా అభివృద్ధి బాటలో నడుస్తోంది అని నొక్కిచెప్పారు.
పాకిస్తాన్ తాజా రెచ్చగొట్టే చర్యలపై స్పందించిన లోకేష్,
భారతదేశం మీద ఎన్ని ప్రతికూల శక్తులు వచ్చినా, ప్రధాని మోదీ నేతృత్వంలో ఏమీ చేయలేవు. ఒక్కసారి మన క్షిపణి మోదీ గారు ప్రతిస్పందిస్తే, పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచే తుడిపిపడుతుంది అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి ఉద్యమంపై కంటతడి
లోకేష్ మాట్లాడుతూ, 1,631 రోజుల పాటు రైతులు, మహిళలు ఉద్యమించారు. 8 ఏళ్ల చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ‘జై అమరావతి’ అంటూ జెండాలు పట్టుకున్నారు. ప్రభుత్వ వేధింపులు, అరెస్టులు, దాడులన్నీ ఎదుర్కొన్నారు. అయినా వారి జ్ఞానం, ఆత్మవిశ్వాసాన్ని అణగదీసేందుకు ఎవ్వరూ సాధ్యం కాలేదు అన్నారు.
ఇది కూడా చదవండి: Bomb Threat: ఏపీ, తెలంగాణ భవన్కు బాంబు బెదిరింపు
అమరావతిని కూల్చే ప్రయత్నం చేసింది గత ప్రభుత్వం అని ఆరోపించిన ఆయన, చంద్రబాబుపై చేసిన వ్యక్తిగత ప్రతీకారమే రాజధాని పునర్నిర్మాణాన్ని అడ్డుకుందన్నారు.
అమరావతి ఒక చెట్టు కాదు… మీ ఇష్టానుసారంగా నరికేయదగినది కాదు. ఇది ప్రజల గుండెల్లో చెక్కిన రాజధాని అని గళమెత్తారు.
రాష్ట్రాభివృద్ధిలో కేంద్ర మద్దతు
పోలవరం, భోగాపురం విమానాశ్రయం, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రకాశం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు – ఇవన్నీ కేంద్రం మద్దతుతో ముందుకు సాగుతున్నాయన్నారు.
రాష్ట్రానికి మోదీ గారి నుంచి అండతో పాటు, నాయుడు గారి నేతృత్వంతో ద్వంద ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వేగంగా పరిగెడుతోంది అని వ్యాఖ్యానించారు.
ఆర్థిక పురోగతి – లక్షల ఉద్యోగాలు
ఇప్పటికే రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 5 లక్షల ఉద్యోగాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే మా లక్ష్యం అన్నారు. ఇందులో భాగంగా ఎన్‌టిపిసి గ్రీన్ ఎనర్జీ (రూ. 1.85 లక్షల కోట్లు), ఆర్సెలర్ మిట్టల్ (రూ. 1.36 లక్షల కోట్లు), బిపిసిఎల్ (రూ. 97,000 కోట్లు) ప్రాజెక్టులను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
కుల గణాంకాల చారిత్రాత్మక నిర్ణయం
తదుపరి జనాభా లెక్కల్లో కుల డేటా చేర్చాలన్న కేంద్ర నిర్ణయం వెనుక ఉన్నది సామాజిక న్యాయం. దశాబ్దాలుగా ఎవ్వరు చేయలేని పని మోదీ గారు చేసినది. ఇది వెనుకబడిన తరగతుల సాధికారతకు పునాది వేస్తుంది అని లోకేష్ అభిప్రాయపడ్డారు.