IND vs NZ: చాంపియన్స్ ట్రోఫీ భాగంగా న్యూజిలాండ్ రేపు జరగబోయే ఫైనల్ లీగ్ మ్యాచ్ కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేనట్లు ప్రచారం జరుగుతోంది. గాయం కారణంగా అతను విశ్రాంతి తీసుకుంటున్నాడని నివేదికలు వచ్చాయి. ఈ విషయంపై భారత స్టార్ వికెట్-కీపర్ మరియు బ్యాటర్ కేఎల్ రాహుల్ తాజాగా స్పందించాడు. పలు విషయాలపై మాట్లాడిన రాహుల్ ఈ గాయాల విషయంపై కూడా స్పష్టమైన వివరణ ఇచ్చాడు.
ప్రీ-మ్యాచ్ కాన్ఫరెన్స్లో రాహుల్ మాట్లాడుతూ… ఫిట్నెస్ విషయంలో, తనకు తెలిసినంతవరకు అందరూ బాగానే ఉన్నారు అని… ఎవరూ న్యూజిలాండ్ తో మ్యాచ్ కు దూరంగా ఉండట్లేదని పేర్కొన్నాడు. ఈ మాటల ద్వారా మహమ్మద్ షమీ కూడా న్యూజిలాండ్ తో మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని పరోక్షంగా స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 27న న్యూజిలాండ్తో మ్యాచ్ కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ పాల్గొనలేదని తెలిసింది. గాయం కారణంగా అతను విశ్రాంతి తీసుకున్నాడు. అయితే, ఫిబ్రవరి 28న రెండవ రోజు ప్రాక్టీస్ సెషన్లో అతను పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతని ఫోటోలు బయటకు వచ్చాయి. దీని ద్వారా అతను న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడతాడని ధృవీకరించబడింది.
ఇది కూడా చదవండి: Jos Buttler: ఇంగ్లాండ్ దీన స్థితికి ప్రతీక..! కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన జోస్ బట్లర్..!
IND vs NZ: అయితే నెట్స్ లో కేవలం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన రోహిత్ శర్మ ఫీలింగ్ డ్రిల్స్ కు మాత్రం అందుబాటులో లేడు. ఎక్కువ శ్రమ చేయాల్సిన ఫీల్డింగ్ విభాగం నుండి రోహిత్ శర్మ తప్పుకోవడంతో అతను న్యూజిలాండ్ మ్యాచ్ కు రెస్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పలు వర్గాలు చెబుతున్నాయి. పైగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అతను కొద్దిగా అసౌకర్యంగా కనిపించాడు. అతనితోపాటు మహమ్మద్ షమీ కూడా మైదానం నుండి కొద్దిసేపు బయటికి వెళ్లాడు.
ఇక న్యూజిలాండ్తో జరగబోయే ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి 300వ వన్డే మ్యాచ్ అవుతుంది. ఈ విషయంపై మాట్లాడుతూ కోహ్లీ ఒక కీలకమైన సీనియర్ ప్లేయర్ అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. విరాట్ మరిన్ని సెంచరీలు సాధిస్తాడు అని చెబుతూ… అతను ఎంత గొప్ప ఆటగాడని… అతనిని వర్ణించడానికి మాటలు సరిపోవు అని చెబుతూనే… అతనిలో ఇంకా ఎన్నో సెంచరీలు దాగి ఉన్నాయి అని అన్నాడు రాహుల్.

