KKR

KKRకు బిగ్ షాక్ .. హెడ్ కోచ్ రాజీనామా

KKR: మూడుసార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) IPL 2026 సీజన్‌కు ముందే భారీ ఎదురుదెబ్బ తగిలింది. హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని KKR యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. పండిట్ కొత్త అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించుకున్నట్లు KKR తెలిపింది. తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా పండిట్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, “కొత్త అవకాశాలను అన్వేషించాలని మిస్టర్ చంద్రకాంత్ పండిట్ నిర్ణయించుకున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ హెడ్ కోచ్‌గా కొనసాగరు.

2024 IPL ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడంతో సహా, ఒక బలమైన, నిలకడైన జట్టును నిర్మించడంలో ఆయన అందించిన అమూల్యమైన సేవలకు మేము కృతజ్ఞులం. ఆయన నాయకత్వం, క్రమశిక్షణ జట్టుపై చెరగని ముద్ర వేశాయి. భవిష్యత్తు కోసం ఆయనకు శుభాకాంక్షలు” అని పేర్కొంది. చంద్రకాంత్ పండిట్ 2022 ఆగస్టులో KKR హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టు ప్రధాన కోచ్‌గా వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఈ పదవిని చేపట్టారు. పండిట్ కోచింగ్‌లో, KKR 2024 IPL సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచింది, పదేళ్ల తర్వాత మళ్లీ టైటిల్‌ను గెలుచుకుంది.

ఇది కూడా చదవండి: AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్ట్

అయితే, 2025 IPL సీజన్‌లో KKR ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. జట్టు 14 మ్యాచ్‌లలో కేవలం ఐదింటిలో మాత్రమే గెలిచి, టోర్నమెంట్ చరిత్రలో అత్యంత తక్కువ స్థానాల్లో (ఎనిమిదో స్థానం) నిలిచింది. శ్రేయాస్ అయ్యర్ జట్టును వీడిన తర్వాత, అజింక్య రహానే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. కానీ జట్టు 14 మ్యాచ్‌ల్లో 5 విజయాలు మాత్రమే గెలిచి 8వ స్థానానికి పడిపోయింది. చంద్రకాంత్ పండిట్ భారత దేశీయ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన తదుపరి ఏ జట్టుకు కోచ్‌గా వెళతారనే దానిపై ఆసక్తి నెలకొంది. KKR ఇంకా కొత్త హెడ్ కోచ్‌ను ప్రకటించలేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *