Kishkindhapuri Trailer: టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటినుంచో కొత్త కాన్సెప్ట్‌లు, విభిన్న జానర్స్‌ను ఆహ్వానిస్తున్నారు. అందులో హారర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంటుంది. ఆ అంచనాలను మరింత పెంచుతూ, సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘కిష్కింధపురి’.
యువ దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్, టైటిల్ నుంచే కుతూహలం రేపుతోంది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ జంట ఇంతకు ముందే రాక్షసుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన సగంతి తెలిసిందే. మళ్ళి ఈ జంట ఇంకో సరి జోడి కట్టడంతో ఈసినిమాపైన అంచనాలు పెరిగాయి.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. థ్రిల్లింగ్ విజువల్స్, డార్క్ హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ తెచ్చాయి. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ మరింత ఉత్సాహాన్ని పెంచింది. ట్రైలర్‌లో చివరి క్షణాల్లో అనుపమ ఇచ్చిన షాకింగ్ ప్రెజెన్స్, బెల్లంకొండ పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
ఇది కూడా చదవండి: Kalvakuntla Kavitha: కవిత కీలక నిర్ణయం.. తండ్రి కి పోటీగా కొత్త పార్టీ..?
సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఇంటెన్స్ సీన్స్ కారణంగా A సర్టిఫికేట్ పొందింది. హారర్ సినిమాలకున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ పూర్తి నమ్మకంతో ఉన్నారు. సినిమా రన్‌టైమ్ 2 గంటలు 5 నిమిషాలు, ఇది కథా తీరు, థ్రిల్లింగ్ మూడ్‌కి పర్‌ఫెక్ట్ లెంగ్త్‌గా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాకి సంగీతం చైతన్ భరద్వాజ్ అందిస్తున్నారు. ఆయన కంపోజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే చర్చనీయాంశమైంది. ఈ హారర్ థ్రిల్లర్‌లో సస్పెన్స్‌ను మరింత ఎలివేట్ చేసే విధంగా ఆయన స్కోర్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
‘కిష్కింధపురి’ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ గతంలో పలు సక్సెస్‌ఫుల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా, హారర్ ప్రేమికులకు కొత్త అనుభూతిని అందించనుంది.