Kishan Reddy: తెలంగాణలో రహదారుల విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలోని నాలుగు సింగిల్ లైన్ రోడ్లను డబుల్ లైన్ రోడ్లుగా విస్తరించేందుకు కేంద్రం ఆమోదం తెలపడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టుల వివరాలను వెల్లడిస్తూ, కిషన్ రెడ్డి మాట్లాడుతూ… “కొత్త ప్రాజెక్టుల ద్వారా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయని, ప్రజల ప్రయాణ కష్టాలు తీరడంతోపాటు, మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి” అని అన్నారు. తెలంగాణలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ రోడ్ల విస్తరణ వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని, ప్రయాణ సమయం ఆదా అవుతుందని, తద్వారా స్థానిక ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులకు ఆమోదం లభించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీల సహకారం ఎనలేనిదని కిషన్ రెడ్డి కొనియాడారు.