Kishan reddy: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గారు తీవ్ర ఆరోపణలు చేశారు వక్ఫ్ బోర్డు ను ఉపయోగించుకొని ఒవైసీ బ్రదర్స్ అనుచరులు లాభాలు పొందుతున్నారని. వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున భూదోపిడీ జరుగుతోందని ఆయన విమర్శించారు. చట్టం ప్రకారం కలెక్టర్లకు అధికారాలు ఉన్నా, ఆ అధికారాలను తక్కువచేస్తూ కొన్ని వర్గాలు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నాయన్నారు.
ఇందులో మహిళల భాగస్వామ్యాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తూ వక్ఫ్ భూములను లాక్కుంటారని అపోహలు కలిగిస్తున్నారు. అయితే ఇకపై వక్ఫ్ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు నాయకుల ఇళ్లలో కాకుండా కంప్యూటర్‌ల్లో డిజిటల్‌గా ఉంటాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
“వక్ఫ్ బోర్డుతో ఇప్పటి వరకు ఎంతమందికి లాభం జరిగిందో చెప్పడానికి రాహుల్ గాంధీ మరియు అసదుద్దీన్ ఒవైసీ సిద్ధంగా ఉన్నారా?” అని ఆయన సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో 70 శాతం వక్ఫ్ భూములను కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు మరియు ఒక మతానికి చెందిన నేతలు కబ్జా చేశారని ఆరోపించారు.
మసీదులు వేరు, వక్ఫ్ బోర్డు భూములు వేరని స్పష్టంగా పేర్కొన్నారు. వక్ఫ్ భూముల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా ఆయన హామీ ఇచ్చారు.

