Kishan reddy: తెలంగాణలో సాగు పనుల కోసం కేంద్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. రాష్ట్రానికి అదనంగా 450 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతి మంజూరు చేసింది. అంతేకాకుండా, 20,000 సౌర ఆధారిత వ్యవసాయ పంప్ సెట్లు కూడా కేటాయించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్రం తీసుకున్న నిర్ణయానికి పట్ల కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే పీఎం కుసుమ్ పథకాన్ని అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.
“ఈ పథకం 2026లో ముగియనుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా రైతుల ప్రయోజనాల కోసం చొరవ చూపాలి. కేంద్రం అందిస్తున్న సహాయాన్ని సమర్థవంతంగా వినియోగించాలి,” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు దృష్టి పెట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర రైతులకు విద్యుత్ సమస్యల నుంచి ఉపశమనం లభించనున్నదే కాకుండా, పర్యావరణహిత సాగుకు మార్గం సుళువవుతుంది.

