స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో ప్రభుత్వాలే కాదు ప్రజల సహకారం, భాగస్వామ్యం కూడా అవసరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్ది. సికింద్రాబాద్, ఎంజీ రోడ్డులోని మహాత్మ గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులార్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల క్రితం నరేంద్రమోదీ ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. స్వచ్ఛత విషయంలో పరిశుభ్రత విషయంలో ప్రభుత్వాలె కాదు ప్రజల సహకారం ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు.
కోట నీలిమ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులలో మహాత్మా గాంధీ చరిత్ర తరతరాలకు నిలిచి ఉంటుందని అన్నారు. అంధకారంలో మగ్గుతున్న భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో గాంధీ పాత్ర కీలకమని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు పీడిత ప్రజలకు ఆయన చూపిన మార్గం గొప్పదని అన్నారు