Kishan Reddy: భూముల అమ్మకంపై జీవో వెనక్కి తీసుకోవాలి

Kishan Reddy: భూముల అమ్మకానికి సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేత కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జోన్ల (Zones) విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

 

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో భారీగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. “హైదరాబాద్‌ను మరో బెంగళూరు చేయాలనుకుంటున్నారా?” అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్‌ వర్గాలకు లాభం చేకూర్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు.

 

హైదరాబాద్‌ పరిస్థితిపై ఆందోళన

 

హైదరాబాద్‌లో ఇప్పటికే తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని, ఈ కారణంగా కొత్త పెట్టుబడులు నగరానికి రావడం కష్టమైందని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజా అభిప్రాయాన్ని పక్కనపెట్టి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన ఆరోపించారు.

 

హిందూ భావాలపై విమర్శలు

 

దేవుళ్లను చులకన చేసే విధంగా ప్రభుత్వ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని, హిందూమతాన్ని అవమానించవద్దని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ఆస్తులు, భావాలను కించపరిచే చర్యలకు ప్రజలు క్షమించబోవని ఆయన హెచ్చరించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *