Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. రాజకీయ విమర్శలకు కూడా పరిమితులు ఉండాలని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్‌ని పాకిస్తాన్‌తో లింక్ చేయడం, రేషన్ బియ్యంతో లింక్ పెట్టడం సరికాదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఫ్రీ బస్సు సేవ తప్ప మరేం చేయలేదని విమర్శించారు. బీజేపీ ఎలాంటి సర్వేలు చేయలేదని, జూబ్లీహిల్స్‌లో పార్టీకి మంచి స్పందన వస్తోందని చెప్పారు. అజారుద్దీన్‌కు మంత్రిపదవి ఇవ్వడం బీజేపీకే లాభం అవుతుందన్నారు.
మెట్రో విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఏ ప్రతిపాదన రాలేదని, ప్రభుత్వం టేకోవర్ చేసిన తరువాత కొత్త DPR కూడా పంపలేదని కిషన్‌రెడ్డి తెలిపారు
గత రెండేళ్లుగా ప్రజల్లోకి రాని కేసీఆర్ మళ్లీ ఎలా సీఎం అవుతారని ప్రశ్నించారు.

