Kishan reddy: వచ్చే 25 ఏళ్లు ఇండియాకి అమృత కాలమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్ది అన్నారు.ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ చేరుకుందన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావడానికి యువశక్తిని వినియోగించుకోవడం అవసరమన్నారు.75 దేశాలకు డిఫెన్స్ పరికరాలు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామని చెప్పారు.రోజు ఎక్కడ కూడా ఉగ్రవాద కార్యక్రమాలు లేకుండా ఐఎస్ఐ మూలాల్ని ఉక్కుపాదంతో అణచి వేశామని వెల్లడించారు. విద్యుత్ మిగులు ఉన్న నూతన భారత్‌ను మోడీ ఆవిష్కరించారన్నారు.
కేంద్ర ప్రభుత్వ రోజ్‌గార్ మేళాలో భాగంగా నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను ప్రధాని, కేంద్ర మంత్రులు నేడు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్ది మాట్లాడుతూ 2047 వరకు వికసిత భారత్ కోసం శక్తి సామర్థ్యాలు సమకూర్చుకోవాలన్నారు. అనేక కంపెనీలకు మన వాళ్ళు సీఈఓలుగా ఉన్నారని తెలిపారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాం.. మాతృ భాషలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఏది కనుగొన్నా దానిలో భారతీయుల మేధస్సు ఉందని తెలిపారు.
పేదవాడి ఇంట్లో టాయిలెట్ నుండి మొదలు పెడితే చంద్రయాన్ వరకు అన్నింటి పైన మోడీ సర్కార్ దృష్టి పెట్టిందన్నారు. యువశక్తి లేని దేశం అభివృద్ధి చెందడం కష్టం… 25 ఏళ్ల తర్వాత దేశంలో యువత తగ్గిపోతుందన్నారు. ఈ దేశాన్ని, తల్లిదండ్రులను, సొంత గ్రామాన్ని, మాతృ భాషను మరవకండి అంటూ యువతకు కేంద్రమంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. కేంద్ర మంత్రులు దీపావళి సైనికులతో జరుపుకోవాలని ప్రధాని మోడీ ఆదేశాలు ఇచ్చారని.. తాను వెళ్తున్నానని చెప్పారు.

