Kiran Abbavaram

Kiran Abbavaram: హిట్ కోసం మళ్ళీ రొటీన్ బాట పట్టిన కిరణ్ అబ్బవరం!

Kiran Abbavaram: వరుస ప్లాపులతో సతమతం అవుతూ ‘క’ సినిమాతో కెరీర్లో ఫస్ట్ హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. మళ్ళీ ‘దిల్‌రూబా’ లాంటి రొటీన్ సినిమాతో వెనక్కి తగ్గాడు. మళ్ళీ ఇప్పుడు ‘బేబీ’ టీమ్‌తో జతకట్టి ‘చెన్నై లవ్ స్టోరీ’తో రీబౌండ్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. సాయి రాజేష్ కథాంశంతో, SKN నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కిరణ్ స్టైలిష్ లుక్, గౌరీ ప్రియతో అద్భుతమైన ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అయితే ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది. తొలి ప్రేమలో నిరాశ తర్వాత సాగే ఈ హృదయస్పర్శి ప్రేమకథ, యూత్‌ను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది. రవి నంబూరి దర్శకత్వంలో, లెజెండరీ మణిశర్మ సంగీతంతో ఈ చిత్రం షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. ‘బేబీ’ లాంటి కల్ట్ హిట్ ఇచ్చిన ఈ టీమ్ మరో సూపర్ హిట్‌ను రిపీట్ చేసేందుకు సిద్ధమవుతోంది. కానీ ఇలాంటి సినిమాలతో వరుస ప్లాపులు ఎదురుకుంటున్న కిరణ్ అబ్బవరం మళ్ళీ అదే రూటుని ఎంచుకోవడం సాహసం అంటున్నారు నెటిజన్స్. మరి ఈ చెన్నై లవ్ స్టోరీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *