KA: కిరణ్ అబ్బవరం నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ ‘క’. తన్వీ రాయ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో కన్నడ సీనియర్ నటుడు అచ్యుత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కోసం కిరణ్ అబ్బవరం మేకోవర్ చేశారు. సుజిత్ – సందీప్ ద్వయం డైరెక్ట్ చేసిన ‘క’ చిత్రానికి సామ్ సి. ఎస్. సంగీతం సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు, జాతర సాంగ్ కు మంచి స్పందన లభించిందని నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. ఐదు భారతీయ భాషల్లో ఈ నెల 31న విడుదల కాబోతున్న ‘క’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా దీని డబ్బింగ్ పూర్తయ్యిందని ఓ వీడియో ద్వారా మేకర్స్ తెలియచేశారు.
