Kingdom: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోర్సే జంటగా.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం.. కింగ్ డమ్.. పోస్టర్స్, టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి. రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేశారు. విజయ్ మేకోవర్.. బాడీ లాంగ్వేజ్, ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్స్, విజయ్-భాగ్యశ్రీల కెమిస్ట్రీ, విజువల్స్, అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ అయ్యాయి. ఇప్పటి వరకు ఉన్న అంచనాలు ఒకెత్తు, ట్రైలర్ చూశాక అవి డబుల్, ట్రిపుల్ అయ్యాయనే చెప్పాలి.. కింగ్ డమ్, జూలై 31న పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ కానుండగా.. 30వ తేది రాత్రి నుండి ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు.
